- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలో ఉన్న గోరిట గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. గ్రామస్తులు గ్రామపంచాయతీ నుండి సింగల్ విండో కార్యాలయం వరకు అలాగే గొరిట నుండి గుమ్మకొండ కు వెళ్లే రహదారి కిరువైపుల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్క కు నీరు పోసి బతికించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెట్ల పెంపకం ద్వారా మానవ మనుగడకు మూడిపని ఉందని చెట్లు ఉంటేనే వర్షాలు బాగా పడతాయని అందుకోసం గ్రామంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.
- Advertisement -