Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సంత మల్లన్నకు నైవేద్యాల సమర్పణకు తరలి వెళ్లిన గ్రామస్తులు

సంత మల్లన్నకు నైవేద్యాల సమర్పణకు తరలి వెళ్లిన గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని  వెంకటాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు సంత మల్లన్నకు నైవేద్యాల సమర్పణకు సంత మల్లన్న గుట్టకు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం వెంకటాపూర్ గ్రామం నుడి సంత మల్లన్న గుట్ట మీది వరకు పాదయాత్రగా వెళ్లడం గ్రామస్తుల ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులు సంత మల్లన్న  స్వామి వారికీ  శ్రావణ మాసం 15రోజులు ఉపవాసాలు పాటించి పౌర్ణమి తర్వాత మొదటి ఆదివారం సంత మల్లన్న గుట్ట మీదికి కుటుంబం సమ్మేతంగా వెళ్లి నైవేద్యం వేసుకొని, వనభోజనాలు  చేసి మొక్కులు తీర్చుకుంటారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం గ్రామస్తులు సంత మల్లన్న గుటమీదికి పాదయాత్రగా వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు గడ్డం హన్మంత్, జక్కుల పోశెట్టి యాదవ్, రాకేష్, సూరి, బొమ్మ భూమ్మన్న, కరెన్న, డిష్ మహేష్ యాదవ్,  గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad