విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ యువజన విభాగం కన్వీనర్ పవన్ కుమార్ చారి
నవతెలంగాణ చారకొండ
విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ యువజన విభాగం కన్వీనర్ పవన్ కుమార్ చారి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ చారి మాట్లాడుతూ.. విశ్వకర్మ సృష్టికర్తగా దేవతల రాజభవనాలు, ఆయుధాలను ,నిర్మించిన ఘనత ఉన్నదన్నారు.విశ్వకర్మ జయంతి అధికారికంగా నిర్వహించడం ద్వారా చేతి వృత్తులకు గౌరవం దక్కుతుందన్నారు. యాంత్రీకరణలో అంతరించిపోతున్న వృత్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని వారు అన్నారు. అదేవిధంగా విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.