- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్ ను ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సందర్శకులకు అనుమతి ఉంటుందని, అమృత్ ఉద్యాన్ నిర్వహణ నిమిత్తం ప్రతి సోమవారం సెలవు ఉంటుందని తెలిపాయి. అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునేవారు ఆన్లైన్, ఆఫ్ లైన్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్ సైట్లో, ఆఫ్ లైన్లో 35వ ఎంట్రీ వద్దకు చేరుకున్నాక స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
- Advertisement -