Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన: మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన: మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి మాచారెడ్డి మండలం మాజీ వైస్ ఎంపీపీ తోట బుగ్గ రాములు అనారోగ్యంతో మృతి చెందగా  మాజీ ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి బిఆర్ యస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రూ 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని నాయకుడని, ఆయన ఉద్యమ చరిత్రను కొనియాడారు. కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ ప్రధాన కార్యదర్శి సలవత్ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ రైతుబంధు మండల కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు రాజా గౌడ్, మాజీ ఎంపీటీసీ రాజేందర్, నాయకులు తోటలింగం, తోట బాలనాగయ్య తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -