Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకమ్చట్కా దీవులో అగ్నిప‌ర్వ‌తం విస్పోటనం

కమ్చట్కా దీవులో అగ్నిప‌ర్వ‌తం విస్పోటనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రష్యా దేశ తూర్పు ప్రాంతమైన కురిల్ దీవుల్లో ఆదివారం 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి సంబంధించి మొదటగా సునామీ హెచ్చరిక జారీ చేసిన రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ, అనంతరం అలల పొడవు తక్కువగా ఉందని పేర్కొంటూ హెచ్చరికను ఉపసంహరించుకుంది. భూకంప ప్రభావంతో తీర ప్రాంతాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ భూకంపం తర్వాత పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా ఎటువంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈ భూకంప తీవ్రతను 7.0గా నమోదు చేసింది.

మరోవైపు, ఈ భూకంపం జరిగిన అదే రాత్రి కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రషెనినికోవ్ అగ్ని పర్వతం 600 సంవత్సరాల తర్వాత మొదటిసారి విస్ఫోటనం సంభవించింది. నివేదికల సమాచారం ప్రకారం, ఈ అగ్ని పర్వతం చివరిసారిగా 1463 ప్రాంతంలో సంభవించిందని వారు పేర్కొన్నారు. కమ్చట్కా వాల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీం అధిపతి ఒల్గా గిరినా మాట్లాడుతూ.. క్రషెనినికోవ్ అగ్ని పర్వతం చారిత్రకంగా ధృవీకరించబడిన మొదటి విస్ఫోటనం అని అన్నారు.

అగ్ని పర్వతం విస్ఫోటనం కారణంగా 6,000 మీటర్ల (3.7 మైళ్లు) ఎత్తులో బూడిద మేఘం ఏర్పడినట్లు కమ్చట్కాలోని అత్యవసర సేవల శాఖ ప్రకటించింది. ఈ బూడిద మేఘం పసిఫిక్ మహాసముద్రం వైపు తూర్పుగా కదులుతోంది. దాని మార్గంలో ఎటువంటి జనావాసాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ అగ్ని పర్వతం విస్ఫోటనానికి ‘ఆరెంజ్ ఎవియేషన్ కోడ్’ను అందించారు. ఇది విమానాల రాకపోకలకు పెరిగిన ముప్పును సూచిస్తుంది. క్రషెనినికోవ్ అగ్ని పర్వతం ఎత్తు 1,856 మీటర్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -