Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడాభారతి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

క్రీడాభారతి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం క్రీడాభారతి ఆధ్వర్యంలో అండర్ 19 వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురాం రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేందర్ రెడ్డి, ఏఎస్ఐ నరసింహులు, బి ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి, రామదండు ప్రతినిధులు రమేష్, సాయికుమార్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -