నవతెలంగాణ-మోపాల్: మోపాల్ మండల్ నర్సింపల్లి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి 15 టీంలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోపాల్ ఎస్సై సుష్మ, నర్సింపల్లి గ్రామ సర్పంచి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకు నడవాలని, ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, చెడు వ్యసనాలకు ముఖ్యంగా గంజాయి, మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేటి యువకులే రేపటి భావి భారత నవనిర్మాణ రూప శిల్పులని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముదిక్పల్లి సర్పంచ్ నరేష్, అలాగే వివిధ గ్రామాల సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



