ప్రజాస్వామ్యాన్ని మోడీ
అంతం చేయాలనుకుంటున్నారు : రాహుల్ గాంధీ
పాట్నా : బీహార్‌లో ఓటర్ల హక్కుల యాత్ర ఆరో రోజైన శుక్రవారం ముంగేర్ నుంచి బయలుదేరి భాగల్పూర్ చేరుకుంది.. గతంలో ఓబీసీలను అణచివేశారు. మీకు అవకాశం ఇచ్చారా..?అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగం రూపొందించబడింది. అందులో భారతదేశంలోని ప్రజలందరూ ఒకటేనని ఉన్నది. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఒక ఓటు వేసే స్వేచ్ఛను ఇస్తుంది. ఒక వ్యక్తి ఒక ఓటు, కానీ ప్రధానమంత్రి మోడీ , ఎన్నికల కమిషన్ కలిసి మీ ఓటును దొంగిలిస్తున్నారు. ఓటు చోర్ మహారాజ్ బీహార్‌కు వచ్చారని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా..పవర్ కట్ అయింది. ”చూడండి విద్యుత్తును నిలిపివేశారు, కానీ విద్యుత్తును నిలిపివేసి గొంతును అణచివేయలేరు. బీహార్‌లో ఒక్క ఓటును కూడా దొంగిలించనివ్వం. ఇక్కడి ప్రజలు దీన్ని ఓటర్ల హక్కుల యాత్రలో నిరూపించారు” అని అన్నారు.
నితీశ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేరు..తేజస్వీయాదవ్
రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వడం లేదని తేజస్వీ యాదవ్ అన్నారు. నితీశ్ వెనక్కి తగ్గారని, ఇది ఆయన చివరి ఎన్నిక అని తేజస్వీ యాదవ్ అన్నారు. నితీశ్ ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి కాలేరని, బీజేపీ ఆయనతో లెక్కలు తెంచుకోవటం ఖాయమని లిఖితపూర్వకంగా ఇస్తున్నాను. అని చెప్పారు.రాహుల్ గాంధీ ముంగేర్‌కు ఇది మొదటి పర్యటన.
ఓట్ చోర్ మహారాజ్
- Advertisement -
- Advertisement -