Sunday, December 7, 2025
E-PAPER
Homeజిల్లాలుఅధికార పార్టీకి ఓటెయ్యండి అభివృద్ధికి బాటలు వేయండి

అధికార పార్టీకి ఓటెయ్యండి అభివృద్ధికి బాటలు వేయండి

- Advertisement -

నవతెలంగాణ తిప్పర్తి: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఆదివారం మండలం లోని సర్వారం గ్రామంలో గడప గడప ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మర్రి నర్సయ్య యాదవును గెలిపించాలని మాజీ సర్పంచ్ పుల్లభట్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు సమకూర్చుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఇందిరమ్మ రాజ్యంలోనే పేద వాడి సొంత ఇంటి కల నెరవేరిందని గ్రామానికి మొదట విడతలో 30కి పైగా ఇండ్లు వచ్చాయని, రెండో విడతలో మరికొందరికి లబ్ది చేకూరుతుందన్నారు.

అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని ఊరులోనే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని అదేవిధంగా మంత్రి సహకారంతో తిప్పర్తి నుంచి సర్వారం రోడ్డు గుంతలు పూడ్చి పునర్నిర్మించి,మిగిలిన సిసి రోడ్లు, డ్రైనేజీలను వేయిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో వార్డు మెంబర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -