Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికార పార్టీకి ఓటేయ్యండి.. అభివృద్ధికి బాటలు వేయండి 

అధికార పార్టీకి ఓటేయ్యండి.. అభివృద్ధికి బాటలు వేయండి 

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
మాసాయిపేట గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కళ్లెం జహంగీర్ విజయ గౌడ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి అని బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలోనీ వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు సమకూర్చుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరిందని, పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి, పాండవుల సత్య ప్రకాష్, గూడూరు కనకమ్మ, సగ్గు కిష్టయ్య, సుంచు శంకరయ్య, సుంచు వినోద్, ఎండి ఉస్మాన్, ఎండి యాకుబ్, గొట్టిపర్తి బాలరాజు, వల్లాల శ్రీశైలం, గజం లక్ష్మీనరసయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -