- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీకి సంబంధించిన ప్రచార లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, పీఏసీ సభ్యులతో కలిసి లోగోను విడుదల చేశారు. ఓట్ల చోరీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల భాజపాపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఓట్ల చోరీని అడ్డుకుందామని.. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతిద్దామని పిలుపునిచ్చారు.
- Advertisement -