-అధికార పార్టీకి పరోక్షంగా అధికారుల వత్తాసంటూ అఖిలపక్షం మండిపాటు
– జాబితాను సవరించాలని సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ – బెజ్జంకి
అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ తప్పుల తడకగా ఓటర్ జాబితా రూపొందించారని..అధికార పార్టీ ఓట్లను దండుకోవడానికి పరోక్షంగా అధికారులు వత్తాసు పలకడమేనని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. శనివారం మండల కేంద్రంలోని కార్యాలయంలో ఎంపీడీఓ ప్రవీన్ ఓటర్ జాబితాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి అభ్యంతరాలను స్వీకరించారు. ఓటర్ జాబితా రూపొందించడంలో అధికారులు వ్యవహరించిన తీరుపై సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మండిపడ్డారు. ఉపాధి కోసం వచ్చిన ఇతర రాష్ట్ర వలస కార్మికులకు అయా గ్రామాల్లో స్థానికులుగా గుర్తించి ఓటు హక్కు కల్పించడం అధికార పార్టీ ఓట్లను దండుకోవడానికి అధికారులు పరోక్షంగా సహరించడమేనని ఆరోపించారు. మండలంలో తప్పుల తడకగా రూపొందించిన ఓటర్ జాబితాను అధికారులు మళ్లీ సవరించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు.
తప్పుల తడకగా ఓటర్ జాబితా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES