అదనపు కలెక్టర్, వీరారెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఓటర్ జాబితా (మ్యాపింగ్) త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) వీరారెడ్డి అధికారులకు ఆదేశించారు. శనివారం ఆలేరు మండల తాసిల్దార్ కార్యాలయం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు తహసిల్దార్ కార్యాలయ రికార్డులు, స్టాఫ్ హాజరు, కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజాపనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా బి ఎల్ ఓలు, సూపర్వైజర్లతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటర్ మ్యాపింగ్ అత్యంత కీలకమని ఆయన పేర్కొంటూ పనిని త్వరితగతిన, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, జాబితాలలో లోపాలు లేకుండా తయారు చేయాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు తహసిల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.



