Wednesday, January 7, 2026
E-PAPER
HomeNewsఓటర్ జాబితా పారదర్శకంగా తయారు చేయాలి

ఓటర్ జాబితా పారదర్శకంగా తయారు చేయాలి

- Advertisement -

*విలేకరుల సమావేశంలో డబ్బికార్ మల్లేష్

నవతెలంగాణ మిర్యాలగూడ

రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు తయారు చేస్తున్న ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉన్నాయని చెప్పారు.

ఒక వార్డుకు చెందిన ఓట్లు మరో వార్డులో చేర్చారని, ఓటర్ల పేర్లు రెండు మూడుసార్లు నమోదయి ఉన్నాయని ఆరోపించారు. వార్డుల సరిహద్దులు మార్చారని, వాటిని వెంటనే సరి చేయాలన్నారు. బోగస్ ఓట్లును తొలగించాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదు అన్నింటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఫోటో గుర్తింపుతో కూడిన ఓటర్ జాబితా విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, సిపిఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -