నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగితే, ఎన్‌డిఎ ప్రభుత్వం కుప్పకూలుతుందని కాంగ్రెస్‌నేత ప్రియాంకగాంధీ వ్యాఖ్యానించారు. గురువారం ఆమె బీహార్‌లో ఎన్నికల ర్యాలీ చేపట్టారు. దేశ అభివృద్ధికి అపారమైన కృషి చేసిన బీహార్ ప్రజల పట్ల ఎన్‌డిఎ ప్రభుత్వానికి గౌరవం లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో కాకుండా మతం పేరుతో ఎన్‌డిఎకు ఓట్లు వేయాలని బీజేపీ నేతలు ప్రజలను డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగితే, ఎన్‌డిఎ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. పేదలు, మహిళలు, యువత కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేస్తారని అన్నారు. బీహార్‌లో గత మూడేళ్లలో 27 బ్రిడ్జీలు కూలిపోయాయని, ఎన్‌డిఎ ప్రభుత్వంలో మౌలికసదుపాయాల అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పేరుతో కాకుండా మతం పేరుతో ఓట్లు అడుతున్నారు: ప్రియాంకగాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



