Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వ్యాస పూర్ణిమ వేడుకలు

ఘనంగా వ్యాస పూర్ణిమ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-తుర్కపల్లి  : తుర్కపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వ్యాస పూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ ..రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురుపౌర్ణమి సందర్భంగా వివిధ రంగాల్లో నిష్టాతులైన గురువులను, కళాకారులను, కులవృత్తి కళాకారులను, గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని వాళ్ల సేవలు ఈ సమాజం ఎప్పటికీ అవసరమని అన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోరెడ్డి మాధవి లత, సుంకరి శివమణి, పండితులు ఫ్రేమ్ కిషోర్ పాండే, అన్నోజు సిద్ధి రామచారి, వడ్రంగి కూరెళ్ల గురువాచారి ,దర్జీ ఆదిమూల వీరస్వామి, కార్వింగ్ తిప్పారం నాగేష్, స్వర్ణకారులు బ్రహ్మచారి, గాయకులు కళాశికం జగదీష్, కూరెళ్ళ సందీప్ చారి, డప్పు కళాకారులు ఎల్లయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోకొండ లక్ష్మీనారాయణ గౌడ్, ఆకుల రమేష్, చాంద్ పాషా, డొంకెన రాజు, జక్కుల వెంకటేష్ ,ఏడుముల ఆంజనేయులు, బినారం కనకయ్య, చిలుకూరు రమేష్, పాముల రామచంద్రం, గోర్ల రామచంద్రం, మేకల పాండు, తాడికొండ నరసింహులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -