Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసినీకార్మికులకు వేతనాలు పెంచాలి

సినీకార్మికులకు వేతనాలు పెంచాలి

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలుగు సినీ రంగ కార్మికులకు వేతనాలను పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్‌ చేశారు. పెద్ద బడ్జెట్‌ సినిమాలకు 30 శాతం, చిన్న చిత్రాలకు 15 శాతం వేతనాలను పెంచాలని కోరారు. వారికి న్యాయం జరిగేవరకు సీపీఐ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని సినీ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహాతో కలిసి నారాయణ మాట్లాడారు. తెలుగు సినీ కార్మికులు వేతనాలు పెంచమంటే ముంబాయి నుంచి సినీ కార్మికులను తెచ్చి పని చేయించుకుంటామంటూ నిర్మాతలు బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక్కడి కార్మికులకు అన్యాయం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్మికుల పక్షాన ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పారు. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగంలో కేవలం 10 కుటుంబాలు, థియేటర్లు నాలుగు కుటుంబాల చేతుల్లో ఉన్నాయని అన్నారు. వారే మొత్తం ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ప్రొత్సాహం అందించాలన్నారు.


రూ.వందల కోట్లతో సమాజాన్ని చెడుమార్గం పట్టించేలా తీస్తున్న చిత్రాలకు ఎలాంటి పరిస్థితుల్లో రాయితీలు ఇవ్వొద్దని కోరారు. టికెట్ల పెంపునకు అనుమతులు ఇవ్వొద్దని అన్నారు. దిల్‌రాజు వంటి పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలను పిలిచి మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినిమా కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పక్షపాతం సరికాదనీ, కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గతంలో సినీ నటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల అప్పుడే క్షమాపణలు చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని నారాయణ గుర్తు చేశారు. కానీ చిరంజీవి మళ్లీ ఆ ప్రస్తావన తేవడం, ఆ వీడియోలను వైరల్‌ చేయడం సరికాదన్నారు. ఈ అంశాన్ని చిరంజీవి నైతికతకు, విజ్ఞతకు వదిలేస్తున్నానని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img