నవతెలంగాణ-హైదరాబాద్: అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న “ఘాటీ” సినిమాకు తన బెస్ట్ విశేష్ అందించారు రెబెల్ స్టార్ ప్రభాస్. “ఘాటీ” సినిమా ట్రైలర్ ఆకట్టుకుందని, ఇంటెన్స్ గా ఉండి ఆసక్తి కలిగించిందని ఆయన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఈ సినిమా టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో అనుష్కను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నానని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు కీ రోల్ లో నటిస్తున్న “ఘాటీ” చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 5న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “ఘాటీ” సినిమాపై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.