- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ యెనుగందుల శైలేందర్ ను పలువురు వార్డు సభ్యులు బుధవారం సత్కరించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా తమ ఎన్నికలకు సహకరించిన శైలేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శైలేందర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల సహకారం ఎంతో కీలకమన్నారు. వార్డుల అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వార్డు సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు విభూది అనిల్, అవారి సురేష్, కొమ్ముల సంతోష్, రాకేష్, బైరగోని అజయ్, సాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



