నవతెలంగాణ – జుక్కల్
ఈ నెల 9 నుంచి 13 వరకు మొదటి విడతగా 5 రోజుల పాటు వార్డు మెంబర్ల శిక్షణా తరగతులు జరగనున్నాయని శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. క్లాసులు ఉదయము 9:00 గంటలకు మొదలవుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణా తరగతులకు వార్డు మెంబర్లు అందరూ తప్పక హాజరు కావాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా (వార్డు మెంబర్లు) కాకపోతే సంబంధిత కార్యదర్శులదే భాద్యత అని తెలిపారు. ఈ కార్యక్రమమానికి సీఈఓ జడ్పీ, డిపిఓ, డిఎల్పిఓ హాజరవుతారని వెల్లడించారు. కావున విధిగా అందరూ తప్పక హాజరవ్వాలని తెలిపారు. క్లాసులకు హాజరు కానివారిపై, వారి భాద్యులపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు.
శిక్షణా తరగతులకు వార్డు మెంబర్లు విధిగా హజరవ్వాలి: ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



