- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా వార్డుల వారీగా వెరిఫికేషన్ పనుల్లో పంచాయతీ కార్యదర్శులు బి ఎల్ ఓ లు నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీలలో ఓటర్లను వార్డుల వారీగా చేర్చే కార్యక్రమం చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. గ్రామంలో నూతన ఓటర్లను కూడా వార్డులో చేర్చే పరిశీలన జరుగుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి పంచాయతీ కార్యదర్శి కుర్ల యనబోరా పంచాయతీ కార్యదర్శి కారోబార్లు బి ఎల్ ఓ అంగన్వాడీ టీచర్లు పంచాయతీ ఓటర్ల జాబితా పరిశీలనలో పాల్గొన్నారు.
- Advertisement -