- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
తొలి నుండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహనీయుడు జయశంకర్ సార్ నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదాలు తో తెలంగాణ సిద్దాంతం రూపొందించారని కమీషనర్ బి.నాగరాజు అన్నారు. ఆయన జన్మదినం పురస్కరించుకుని బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం కమీషనర్ నాగరాజు మాట్లాడుతూ 1952 నాటి నుండే తెలంగాణ ప్రాంత అస్తిత్వం కోసం,ఇక్కడి పౌరుల హక్కులను కాపాడటం కోసం తొలి – మలి దశల తెలంగాణ ఉద్యమంలో రాజీపడని పోరాటం చేసారని గుర్తు చేసారు. తెలంగాణ సాధించడంలో ఆయన పాత్ర కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -