Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జయశంకర్ ఆశయాలు పాటించడమే అసలైన నివాళి

జయశంకర్ ఆశయాలు పాటించడమే అసలైన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
ప్రభుత్వ జూనియర్ కళాశాల పరకాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ టీ. మహిపాల్ రెడ్డి మొదటగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎండి సర్దార్, అధ్యాపకులు కృష్ణమోహన్ వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి, నాన్ టీచింగ్ సిబ్బంది సత్యనారాయణ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -