నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
వర్షాలు సమృద్ధిగా కురవాలని పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర దేవస్థానంలోని శివునికి రైతులు, గ్రామస్తులు కలిసి శనివారం జలాభిషేకం చేశారు. వర్షాలు కురవని సంవత్సరం గ్రామ ఆనవాయితీగా గ్రామంలో ఉన్నటువంటి పురాతమైన శివునికి జలాభిషేకం చేయడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.అదేవిధంగా ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో గ్రామ రైతులు,పెద్దలు కలిసి శివునికి జలాభిషేకం చేశారు.అనంతరం గ్రామ పురహితులు మాట్లాడుతూవర్షాలు కురవని సంవత్సరం శివునికి అభిషేకం చేయడం, చేసిన అనంతరం వర్షాలు కురవడం అనావతిగా వస్తుందని అందుకే ఈ సంవత్సరం కూడా జలాభిషేకం చేశామని తెలిపారు.సోమవారం రోజున అన్నప్రసాద కార్యక్రమము ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పురహితులు శ్రీ పత్రావు జోషి, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
వర్షాలు కురవాలని శివునికి జలాభిషేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES