రిజర్వేషన్లు కల్పించకపోవడంతో బండ లేమూర్ దళితుల ప్రకటన
సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-మంచాల
తమ గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించలేదని, అందుకే తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు గ్రామస్తులు ప్రకటించారు. మంగళవారం గ్రామానికి చెందిన దళితులు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 10 వార్డులు ఉంటే 5 స్థానాలు ఎస్టీలకు, 3 స్థానాలు బీసీలకు, 2 స్థానాలు జనరల్‌కు రిజర్వు చేశారని తెలిపారు. 200 ఓట్లు ఉన్న ఎస్సీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదని అన్నారు. అధికారుల నిర్లక్యంతోనే తమకు అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా రానున్న స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అధికారులు పక్షపాత దోరణి వదిలి.. తమకు న్యాయం చేయాలని, ఎస్సీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆకారం కృష్ణ, మహేష్, కొంకణి విజయ్, జే.లింగస్వామి, దిలీప్, శివ, పరమేశ్, మహేష్ ఉన్నారు.