రేర్‌ఎర్త్ మెటీరియల్, అత్యాధునిక చిప్స్ తయారీ టూల్స్ రాకపోతే కష్టమే : జేపీ మోర్గాన్ సీఈవో
న్యూయార్క్ : అమెరికా-చైనాల మధ్య చిప్స్ గొడవ తీవ్రమైన వేళ.. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈవో జామీ డిమోన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో 100 శాతం పెన్సిలిన్ చైనా నుంచే దిగుమతి అవుతోందన్నారు. అది ఇబ్బందికరమే అని పేర్కొన్నారు. దీనికితోడు రేర్‌ఎర్త్ మెటీరియల్, అత్యాధునిక చిప్స్ తయారీ టూల్స్ వంటివి కూడా బీజింగ్ నుంచే వస్తున్నాయన్నారు. అత్యంత శక్తిమంతమైన ఏఐ సిస్టమ్స్ తయారీకి వాడే చిప్స్ తయారీ పరికరాలు కూడా అక్కడినుంచే వస్తున్నాయన్నారు. చైనా సూపర్‌సోనిక్ మిసైల్స్‌ను మరింత శక్తి మంతంగా మార్చే వాటిని ఎగుమతి చేయవద్దని డిమోన్ సూచించారు. అయినా వారి పురోగతి వేగాన్ని మనం తగ్గించగలమే కానీ.. ఆపలేమని పేర్కొన్నారు.
ఎన్విడియాకు చైనాలో ఎదురుగాలి
చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాకు చైనాలో ఎదురుగాలి వీస్తోంది. ఆ సంస్థ తయారుచేసిన హెచ్20 చిప్స్‌కు ఆ దేశం పెద్ద మార్కెట్. తాజాగా చైనా నియంత్రణ సంస్థలు ఆ చిప్స్‌తో సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని ఎన్విడియాకు సమన్లు జారీ చేశాయి. దీనికి ఆ సంస్థ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్పందిస్తూ.. సదరు హెచ్20 చిప్స్‌లో ఎటువంటి బ్యాక్‌డోర్లు, కిల్ స్విచ్‌లు, స్పైవేర్‌లు లేవని బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది. చైనా టెక్ దిగ్గజాలైన అలీబాబా, బైట్‌డ్యాన్స్ ఈ చిప్స్ ఆర్డర్లను పునఃపరిశీలిస్తున్నాయి.
చైనాపై ఆధారపడ్డాం.. ఇబ్బందికరమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES