మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ..
నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మండలంలోని గాంధీ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చక్కటి చదువును అందిస్తున్నామన్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు, సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని కోరారు కార్యక్రమంలో జన్నారం మాజీ సర్పంచి అజ్మీర నందు నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES