నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం ..
నవతెలంగాణ – వెల్దండ
రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలో ఎన్నికల నిర్వహించిన నిర్వహించేందుకు జిల్లా యంత్రంగా సిద్ధంగా ఉందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ , జిల్లా పరిషత్ ఎన్నికల అధికారి దైవ సహాయం అన్నారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యపాల్ రెడ్డితో కలిసి జడ్పిటిసి, ఎంపిటిసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రచురించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ ఈనెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డులు, ఎంపిటిసి ప్రాదేశిక స్థానాలలో, జడ్పిటిసి ప్రాదేశిక స్థానంలో ఓట్ల సవరణకు ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు. తప్పు పులుసువరించి పదవ తేదీన పూర్తిస్థాయి ఎలక్ట్రోలల్ డ్రాఫ్ట్ ప్రచురిస్తామన్నారు. అలాగే 8 వ తేదీన గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల తో సమావేశం లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పోలింగ్ బూత్ లను నిర్ధారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఎం పీ ఓ లక్ష్మణ్, సీనియర్ అసిస్టెంట్ రేవతి రెడ్డి, కార్యదర్శులు గిరి , ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES