నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ లో కలప అక్రమ రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. గురువారం జన్నారం ఎఫ్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులతో మాట్లాడారు. జన్నారం ఆటో డివిజన్ పరిధిలోని తలపేట రేంజ్ పరిధిలో వస్తున్న తపాలాపూర్ చెక్ పోస్ట్, ఇందన్ పెళ్లి రేంజ్ పరిధిలోకి వస్తున్న కలమడుగు చెక్పోస్ట్, ఇందన్ పల్లి చెక్ పోస్ట్ ల వద్ద గట్టిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నామన్నారు. గ్రామాల్లో కూడా అక్రమ కలప రవాణా చేస్తున్న వారిపై గట్టి నిఘా ఉంచామని, వారి వివరాలన్నీ సేకరిస్తున్నామన్నారు. అక్రమంగా కలప రవాణా చేస్తున్న వారికి అటవీశాఖ అధికారులు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని విధులనుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. అటవీశాఖ అధికారులు అటవీ నిబంధనలకు లోబడి తమ విధులను నిర్వహించాలన్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి అడవి విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నామన్నారు.. అక్రమంగా కలప రవాణా చేసిన చెట్లను నరికిన నిలువ ఉంచిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నామన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ అడవులలో నుంచి వాగులో నుంచి ఇసుక తీయటం కూడా నేరమన్నారు. అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు.
కలప అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేస్తున్నాం: ఎఫ్డీఓ రామ్మోహన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



