Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు పంపిణీ చేశాము..

అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు పంపిణీ చేశాము..

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
: పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ను పంపిణీ చేశామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… నిజమైన లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల పట్టాల పంపిణీ చేశామని తెలిపారు. చేయ చేతకాక, ఇండ్ల నిర్మించి ఏళ్లు గడిచిన పంపిణీ చేయలేదన్నారు. మండలంలో పంచిన పాపను పోలేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే విదంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల కు ఇసుకను ఉచితంగా ఇస్తుందన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కెసిఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసినప్పుడు మీ కౌన్సిలర్లు డబ్బులు దండుకున్న విషయాలను ఆధారాలతో రుజువు చేశామని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తుంటే ఓర్వలేక బిఆర్ఎస్ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తోట ఆగయ్య విలేకరుల సమావేశంలోని తీట మాటలు మానుకోవయ్యా అంటూ ఎద్దేవా చేశారు. పార్టీలకు అతీతంగానే అసలైన లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, లింగాల భూపతి,డైరెక్టర్లు ఇట్టి రెడ్డి శ్రీనివాసరెడ్డి,పరుశురాములు, మునిగల రాజు, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, ఆసరి బాలరాజు, మోర లక్ష్మీరాజ్యం, గుగ్గిల భరత్ గౌడ్, ముక్క వాసు, బండి పరశురాములు, ఎగురుల ప్రశాంత్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -