Sunday, March 15, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్మన బాధ్యతలను మనమే నిర్వర్తించాలి

మన బాధ్యతలను మనమే నిర్వర్తించాలి

- Advertisement -

ఇంకొల్లు అనే మారుమూల గ్రామం. అక్కడి పచ్చని పొలాలల్లో నిత్యం కలిసి తిరిగే మూడు ఆవులు శబరి, జానకి, సావిత్రి. ఈ మూడు కొన్ని సంవత్సరాలుగా స్నేహితులు. ఒకరికొకరు తోడుగా ఉండి, పచ్చిక తింటూ, చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ తమ జీవనాన్ని ప్రశాంతంగా సాగించేవి. వాటిని చూసుకునే రైతు యేసు, ఎప్పుడూ ”నా ఆవులు నా కుటుంబం” అని చెప్పుకునే మనిషి. వాటికి మంచి ఆహారం, నీరు, ఆశ్రయం అన్నీ అందిస్తూ ఉండేవాడు. ఆవులూ సంతోషంగా, నమ్మకంతో జీవించేవి. ఒక శుక్రవారం, శబరి ఒక చిన్న దూడకు జన్మనిచ్చింది. ఆ దూడను చూసిన శబరి హదయం ప్రేమతో నిండిపోయింది. తన, ప్రాణంలా భావించింది. యేసు వద్దకు వెళ్లి వేదనతో ఇలా చెప్పింది: ”నా దూడను నన్ను దూరం పెట్టకండి. పరిసరాల్లో తిరిగే భయంకరమైన కుక్కలు దానికి హాని చేస్తాయేమో అని నాకు భయంగా వుంది. దయచేసి దాన్ని కాపాడండి” అంది.
యేసు నమ్మకంగా నవ్వుతూ ఇలా చెప్పాడు… ”అమ్మా… శబరి, ఆ కుక్కలు నాకెంతో విశ్వాసం గలవి. అవి మీకు ఎలాంటి హాని చెయ్యవు. నువ్వు నన్ను నమ్ము. నీ దూడను నేను కంటికి రెప్పలా కాపాడుతాను” అన్నాడు.
అతని మాటలపై శబరి నమ్మకం పెట్టుకుంది. యేసు ఆ దూడను ఆవు నుంచి కొంచెం దూరంగా కట్టేసాడు. రాత్రి అలసటతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. శబరి మాత్రం తన దూడ కోసం రాత్రంతా కలవరపడుతూ, యేసు మాటలపై ఆధారపడి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. కానీ ఆ రాత్రే యేసు ఎంతో విశ్వాసంతో పెంచుకున్న కుక్కలు దూడ వాసన పసిగట్టి అవి దూడ పై దాడి చేసి ఆ చిన్న ప్రాణాన్ని కబళించాయి. ఉదయం, ఆ సంఘటన తెలిసిన శబరి గుండె ఛిద్రమైంది. తన బిడ్డ ప్రాణం పోయిందన్న నిజాన్ని తట్టుకోలేకపోయింది. తాను వణికిపోతు బాధను దిగమిగింది.
”అడవిలో క్రూరమైన పులి నుండి కూడా నా పూర్వీకులు తమ పిల్లలను రక్షంచుకున్నారు.
మనం మనుషులను నమ్మి జీవించగా వాళ్లు నమ్మిన కుక్కల చేత నా బిడ్డ చనిపోయింది. ఇది ఏమీ విధి?” అని శబరి అయోమయంలో పడిపోయింది. ఆ సమయానికి ఆవుకు తోడుగా నిలిచిన జానకి, సావిత్రి. శబరితో ఇలా అన్నాయి… ”ఇక మన పిల్లల ప్రాణాలను ఎవరి చేతుల్లో పెట్టటం మంచిది కాదు. మన జీవితం మనం కాపాడుకుందాం. అడవిలో జీవం కష్టం అయినా, అక్కడి స్వేచ్ఛ నిజమైన రక్షణ.” ఉంటుందని భావించి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయ. కొన్ని నెలల తర్వాత, జానకి ఒక చిన్న బుజ్జి దూడకు జన్మనిచ్చింది. ఆ దూడను మూడు ఆవులు కలిసి తమ బిడ్డగా భావించాయి. దానికి జానకి తన తల్లిప్రేమను, సావిత్రి తన పరిరక్షణను, శబరి తన స్నేహాన్ని పంచింది. ఆ బుజ్జి దూడ అడవిలో, చెట్ల కింద, పూల వాసన మధ్య పెరిగింది. మూడు ఆవుల ప్రేమతో, అప్రమత్తతతో, ఒక కొత్త జీవితంతో అక్కడ ప్రశాంతంగా కోసాగించాయి.

డా.పూసపాటి వేదాద్రి , 9912197694న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -