Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నులి పురుగుల నిర్మూల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి..

నులి పురుగుల నిర్మూల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు.

గురువారం రోజు జాతీయ నులిపురుగుల నియంత్రణ దినోత్సవం కార్యక్రమం నిర్వహణ పై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది.  రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు  మాట్లాడుతూ 01 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజల్ మాత్రలు అందజేయాలన్నారు. జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 01 నుంచి 19  ఏళ్లవారికి ఆల్బెండైజర్ మాత్రలు వేయాలని ఈ నెల 11 తేదీన నిర్వహిస్తున్న జిల్లా నులిపురుగుల దినోత్సవంలో పిల్లలందరికీ ఆల్బెండజలు మాత్ర మింగించడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

జిల్లాలో 1,43,789 మందికి పిల్లలకు ఈ మాత్రలు వేయాలని 01 నుంచి 02 సంవత్సరాల మధ్య చిన్నారులకు సగం మాత్ర పొడిచేసి పాలు లేదా నీటిలో కలిపి తాగించాలి, 03 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర మింగించాలన్నారు. పిల్లలలో రక్తహీనత పోషకాహార లోపము నివారించడానికి ఇది దోహదపడుతుందన్నారు.  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మనోహర్  మాట్లాడుతూ, జాతీయ నులిపురుగుల నియంత్రణ దినోత్సవ కార్యక్రమము  తేది: 11 ఆగస్టు 2025 , మాప్ అప్ డే: 18 ఆగస్టు 2025 నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు నులి పురుగులు (కీములు) నివారించేందుకు ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవము 2025 ఫిబ్రవరి 2025 న మెదటి సారిగా, రెండవ సారి ఆగస్టు 11న జరగనుందనారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలు, వేద పాఠశాలలు, మదర్సాలు, అనాథ శరణాలయాలు మరియు బడి బయటి పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్  సమన్వయ సమావేశం  నిర్వహించగా, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఆగస్టు 18 వ తారీఖున మిస్సయినవారికోసం  మరోసారి మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందనారు. 

 జిల్లా ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా సంబంధిత పాఠశాలలు లేదా ఆంగన్‌వాడీ కేంద్రాలకు పంపించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. రామకృష్ణ, డిఆర్డిఓ  నాగిరెడ్డి,ఉప జిల్లా వైద్యాధికార్లు డా. శిల్పిని, డా.యశోద, ప్రోగ్రాం అధికారులు డా. రామకృష్ణ, డా. సుమన్ కళ్యాణ్, డెమో వి. అంజయ్య, జిల్లాలోని వివిధ   శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img