– మొండిగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం : భూనిర్వాసితుల సంఘం నాయకులు
– నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల భూనిర్వాసితుల రాస్తారోకో
నవతెలంగాణ- మక్తల్
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధరకనుగుణంగా పరిహారం అందివ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో బస్టాండ్ రోడ్డు వద్ద భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి కేశవ్ గౌడ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. 20 రోజులుగా భూ నిర్వాసితులు జిల్లా కేంద్రంలో రీలే దీక్షలతో పాటు జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తామన్న ఎకరాకు రూ.14 లక్షల పరిహారం ఆమోదయోగ్యం కాదని, ఆ డబ్బుతో భూమి కొనే పరిస్థితి లేదని అన్నారు. ప్రాజెక్టులకు భూములు ఇస్తున్న భూనిర్వాసితులకు అన్యాయం చేయొద్దని, వారిని శాశ్వత వలసదారులుగా తయారు చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా వెనుకబడి గురైన నారాయణపేట ప్రాంతానికి ఈ ఎత్తిపోతల పథకం ఎంతో ఉపయోగపడుతుందని, కానీ అదే స్థాయిలో భూనిర్వాసితులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం అందించేలా న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి నిర్వాసితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరారు. లేకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు పుంజనూర్ ఆంజనేయులు, సీఆర్ గోవింద్ రాజ్, కాట్రేపల్లి, కార్చ్వర్ ఎర్నాగుపల్లి గ్రామ నాయకులు ఆంజనేయులు, హనుమంతు, నరసింహులు, కృష్ణ, మాలగజలప్ప, జిలానీ, నారాయణ గౌడ్, సత్యనారాయణ గౌడ్, అంజప్ప, బొంబాయి సోమన్న తదితరులు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులను ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES