Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి 

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజు అన్నారు. ఆశడే సందర్భంగా మంగళవారం తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య,ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసిటిసి కౌన్సిలర్ గాదే రమేష్ తో కలిసి ఆయన హాజరై ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సమాజానికి తలవంపుగా మారుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నదని వివరించారు.

హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ అన్ని గ్రామాల్లో సైతం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఐవి,టీబీ పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవితో పాటు సిఫిలిస్,సుఖరోగాలకు సంబంధించిన పరీక్షలను తప్పనిసరిగా చేయించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. తాడిచర్ల మండలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన  వలస కార్మికుల వల్ల ఎయిడ్స్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.అవగాహన,చైతన్యంతోనే ఎయిడ్స్ వ్యాప్తిని నివారించడానికి సాధ్యమవుతుందన్నారు. సంపూర్ణ సురక్ష కేంద్రం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తుందని వివరించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యక్రమాలను ఇంటింటికి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సదుద్దేశంతో సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పాజిటివ్ వ్యక్తుల పట్ల ఉదారతతో వ్యవహరించాలని అన్నారు. ఏఆర్ టి  మందులను బాధితులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అనంతరం ఐఈసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమ సింగ్, సంపూర్ణ సురక్ష కేంద్రం ఓఆర్ డబ్ల్యూ వసంత, హెడ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ రాజనారాయణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -