నవతెలంగాణ-హైదరాబాద్: ఐఐటీ మద్రాస్‌లోని అగ్నిశోధ్-ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ (IARC) ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్మీ చీప్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్‌లో మేం చెస్ గేమ్ ఆడాం. శత్రువు తదుపరి కదలికలు ఎలా ఉండబోతున్నాయో.. మేం ఏం చేయబోతున్నామో మాకు తెలియదు. దీనిని గ్రే జోన్ అంటారు. గ్రే జోన్ అంటే మనం సంప్రదాయ కార్యకలాపాలకు వెళ్లడం లేదు. మనం చెస్ గేమ్‌లో పావుల్లా ముందుకు సాగాం. శత్రువు అంచనా వేయలేని విధంగా దాడులు చేశాం. పాకిస్తాన్, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి అని చెప్పుకొచ్చారు.
ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ మునీర్‌ను ఆ దేశ ‘ఫీల్డ్ మార్షల్’గా నియమించారని ద్వివేది సెటైర్లు వేశారు. వాళ్లు యుద్ధంలో గెలిచినట్లు అక్కడి ప్రజలను భ్రమలో ఉంచి.. ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇచ్చారని ఎద్దేవా చేశాడు.