మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్‌అండ్‌బీలో పూర్తి పారదర్శకతతో ప్రమోషన్లు ఇచ్చామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు కలిశారు. అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాల శాఖలో ప్రమోషన్లు ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆర్ అండ్ బీ శాఖలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్ అప్రూవల్ చేసుకొని రెగ్యులర్ ప్రమోషన్లు వచ్చేలా కషి చేశానని తెలిపారు. శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చి మీరు అడిగినవన్నీ చేస్తున్నానన్నారు. మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ శాఖ బలోపేతంపై దష్టి పెట్టి అదే స్థాయిలో పని చేసేందుకు కషి చేయాలని సూచించారు.
ప్రజల్లో ఆర్‌అండ్‌బీ శాఖకు మంచి పేరు తీసుకువచ్చే బాధ్యత శాఖ ఇంజనీర్లపైనే ఉందన్నారు. ఆ గురుతర బాధ్యతను గుర్తెరిగి ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని మంత్రి వారికి హితబోధ చేశారు. మీరు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి అయిన తర్వాతనే మా సమస్యలు పరిష్కారమై, రెగ్యులర్ ప్రమోషన్లు వచ్చాయని ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆర్ అండ్ బీ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్.శ్రీను, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పి. శరత్‌చంద్ర, కోశాధికారి మహేందర్ కుమార్, ఉపాధ్యక్షులు కె.సంధ్య, వేణు, ప్రదీప్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు నవీన్, కిషన్, అరుణ్ రెడ్డి పలువురు ఆర్ అండ్ బీ ఇంజనీర్లు ఉన్నారు.
పూర్తి పారదర్శకంగా ఆర్‌అండ్‌బీలో ప్రమోషన్లు ఇచ్చాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES