- Advertisement -
– గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్
నవతెలంగాణ గాంధారి: గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ నుండి కొత్తగూడెంకు కబడ్డీ, వాలీబాల్ గేమ్స్ ఆడటానికి వెళ్తున్న రెండు టీములకు గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్ శ్రీ సాయి హాస్పిటల్ తరఫున టీషర్ట్స్ అందజేశారు.

ఈ సందర్భంగా గాంధారి తాజా మాజీ సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగూడెంలో ఆటలలో గెలుపొంది జిల్లాలోని గాంధారి కి మంచి పేరు తేవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -