నవతెలంగాణ-రామారెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్దదారులు, వెంటనే ఇంటి నిర్మాణాలను చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రూ 5 లక్షలు లబ్ధి పొందాలని జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని పోసానిపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దశలవారీగా అందిస్తున్న సబ్సిడీని లబ్ధిదారులు వినియోగించుకోవాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని, ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సమస్యల పరిష్కరించుకొని నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్, ఎం పి ఓ తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



