నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు, ప్రజలు, భూ పోరాటాలు, భూమి కోసం నిర్వహించాలన్నారు. సుందరయ్య జీవితం దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లిన ఒకే ఒక్క వ్యక్తన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత అయినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పోరాట స్ఫూర్తితో ఈ జిల్లాలో అనే ప్రాంతమైన అసెస్మెంట్ భూములు వాటిని పేద ప్రజలకు అర్హులకు ఇచ్చేంతవరకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు, మండల నాయకులు ప్రవీణ్, పేరం నర్సవ్వ, శ్యామల, సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య స్ఫూర్తితో పోరాటం చేయాలి: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
- Advertisement -
- Advertisement -



