- Advertisement -
- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య
నవతెలంగాణ-మిరుదొడ్డి: భారత రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ చేపట్టిన భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమం ఆదివారం మండల కేందమైన భూంపల్లి అక్బర్ పేటలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లనే దేశంలో స్వేచ్చ, సమానత్వం, సోదరభావం అన్ని రంగాలలో సామాజిక న్యాయం అమలులోకి వచ్చిందన్నారు. సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని జీర్ణించుకోలేని మనువాదులు భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా తిప్పి కొట్టాలన్నారు. అనంతరం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ.. 76వ భారత రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమం చెపట్డమన్నారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తాడెం కృష్ణ, జిడిపల్లి రవి,కమటం వెంకటస్వామి,సురేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



