Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆటలుధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో పతకాలు సాధించాలి

ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో పతకాలు సాధించాలి

- Advertisement -

– క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
– ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ పసిడి పతకాలతో హాకీలో స్వర్ణయుగాన్ని రచించిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో యువ క్రీడాకారులు పతకాలు సాధించాలని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నారు.. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా సాధన చేయాలని మంత్రి సూచించారు. క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వాకిటి శ్రీహరి.. శాట్జ్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డితో కలిసి హాకీ మ్యాచ్‌ను ఆరంభించారు. ‘తెలంగాణలో తొలిసారి తొమ్మిది రోజుల పాటు క్రీడా దినోత్సవ వేడుకలను నిర్వహించాం. ఏడాదిలోనే జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించాం. నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్‌ దశ దిశ గుణాత్మకంగా మారనుందని’ శివసేనా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్‌ రెడ్డి, శాట్జ్‌ ఎండీ సోనిబాలా దేవి, పారిస్‌ పారాలింపిక్స్‌ మెడిలిస్ట్‌ దీప్తీ జీవాంజి, ఆసియా క్రీడల పతక విజేత నందిని అగసార, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కోశాధికారి సతీశ్‌ గౌడ్‌ తదితరులు స్పోర్ట్స్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు.

అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు స్పోర్ట్స్‌ డే వేడుకల్లో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 41 మంది క్రీడాకారులకు రూ.1.29 కోట్ల ప్రోత్సాహకాలు అందించి ఘనంగా సన్మానించారు. ప్రపంచ ఆర్చరీ యూత్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి సాధించిన చికిత తానిపర్తికి రూ. 5 లక్షలు, పవర్‌లిఫ్టర్‌ శతికి రూ. 5 లక్షలు, షఉటర్‌ ఇషా సింగ్‌కు రూ. 4లక్షలు, పవర్‌లిఫ్టర్‌ తుడి శ్రీ వందనకు రూ. 5 లక్షలు, భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌కు రూ.5 లక్షలు అందించారు. రోలర్‌ స్కేటింగ్‌లో పతకాలు సాధించిన తేజేశ్‌, కాంతి శ్రీ, శ్రీయా మురళీ, ఎండూరు ఆకాంక్ష, చలంచర్ల జోహిత్‌, జియా జయేశ్‌ పటేల్‌, రక్షిత్‌ మరళి, సంచిత చౌదరి, ప్రతీక్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ప్రదానం చేశారు. పారా క్రీడాకారులకు సైతం ఈ సందర్భంగా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

గురు వందనం ప్రారంభం
కోచ్‌ల సంక్షేమం కోసం తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ తీసుకొచ్చిన ‘గురు వందనం’ పేరుతో బీమా పథకాన్ని మంత్రి వాకిటి శ్రీహరి, శివసేనా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాదిలో తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తర్పీదు ఇచ్చిన కోచ్‌లకు ఉత్తమ కోచ్‌ల పురస్కారాలు ప్రదానం చేశారు. అనూప్‌ యమ (స్కేటింగ్‌), రవి కుమార్‌ (హ్యాండ్‌బాల్‌), రామకష్ణ (కయాకింగ్‌), ప్రవీణ్‌ కుమార్‌ (పవర్‌లిఫ్టింగ్‌), ఖదీర్‌ (రోలర్‌ ఐస్‌ స్కేటింగ్‌), ఎం. శ్రీనివాస్‌ (అథ్లెటిక్స్‌)లు ఉత్తమ కోచ్‌ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగి పురస్కారం పిఆర్‌ఓ కాలేరు సురేశ్‌ దక్కించుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad