Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాయి బ్రాహ్మణ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి: రాపోలు సుదర్శన్

నాయి బ్రాహ్మణ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి: రాపోలు సుదర్శన్

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులను అన్ని వర్గాల ప్రజలు గెలిపించాలని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు కంది సూర్యనారాయణ, ప్రముఖ కవి రాపోలు సుదర్శన్ అన్నారు. సోమవారం చాదర్ఘాట్ సీతారాములయ్య  ట్రస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణులకు ఇప్పటివరకు చట్టసభల్లో అవకాశాలు దక్కలేదని, ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులు గెలిచేలా నాయి బ్రాహ్మణులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల, గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

రాజకీయంగా ఇప్పటివరకు వెనుకబడ్డామని ఇప్పటికైనా చైతన్యంతో ముందుకెళ్లి పోటీచేసి గెలవాలన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కూడా రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో టికెట్లు కేటాయించి తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలు సహకరించాలన్నారు. ఇతర బీసీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా తమకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నాయి బ్రాహ్మణు లందరం ఏకతాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే రాజ్యాధికారం సాధిస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మక్త శ్రీనివాస్, ఎన్ జె ఎస్ సంస్థ శ్రీధర్ మురహరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -