– ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్
– నూతన సర్పంచ్ లకు సన్మానం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింతా రాజ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండలంలోని ఆయా గ్రామాల నూతన సర్పంచ్ లను ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్లను నిర్దేశించి ఆయన మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందేలా సర్పంచులు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సీసీ అలేఖ్య, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



