Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలి

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలి

- Advertisement -

బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్
నవతెలంగాణ – కాటారం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలని కార్యకర్తలకు బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….రాష్టంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. హమీలను పూర్తిగా ప్రజలకు అందించకుండా కాలయాపన చేస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన ఎజెండాగా పోరాటం సాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వాడ వాడాలా.. పల్లె పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీలను వివరించారు.

మహిళకు నెలకు రూ.2500, సబ్సిడీ గ్యాస్ ప్రతి, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం,బోనస్, రైతు ఋణ మాఫీ ఎటుపోయినవి అని ప్రశ్నించారు. అలాగే తులం బంగారం, మహిళలకు స్కూటీలు, యూరియా కొరత, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసన్ని, ప్రజలకు వివరించాలన్నారు. ఈ మోసపూరిత గ్యారంటీ హామీ పథకాలు ప్రజలకు వివరిస్తూ అలాగే తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిఅర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు అభివృద్ధి చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. ఇప్పుడు వచ్చిన ఎన్నికలు మన కొరకు అని అన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు పాటిస్తూ మండలంలో 24 గ్రామ పంచాయతీలలో బిఅర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చెయ్యాలి అని కార్యకర్తలను జోడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad