- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గత 25 సంవత్సరాలుగా రావిరాల శీను ఎలక్ట్రిషన్ గా గ్రామంలో సేవలందించి అనారోగ్య సమస్యతో మృతి చెందడం బాధాకరమని తోటి కార్మికులు అన్నారు. గురువారం దశదినకర్మ సందర్భంగా శ్రీను కుటుంబానికి 50 కేజీల బియ్యం ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన శ్రీను మృతి సిఐటియు యూనియన్ కు తీరని లోటు అని అన్నారు. ఆ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చిన తము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బ పురుషోత్తం , కంచర్ల సందీప్ , పందుల నర్సింహా ,పందుల సుధాకర్ పాల్గొన్నారు.
- Advertisement -