– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణాలన్ని పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి పలు రహదారుల నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. గోళ్లపాడు నుంచి రామన్నపేట వరకు రూ.3.52 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, పల్లెగూడెం-మంగళగూడెం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఊటవాగు తండా వరకు రూ.75 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పున్ణనిర్మాణం పనులను ప్రారంభించారు. అలాగే, మంగళగూడెం నుంచి సర్వే నెం.272 వరకు రూ.165 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం, కొత్తూరు నుంచి లకావత్ తండా వరకు రూ.2.20 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలో బురద లేని అంతర్గత రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లుగా కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.22,500 కోట్లతో ప్రభుత్వం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో మంజూరు చేశామన్నారు. ఎన్నో కార్యక్రమాలు అమలుచేసి, అర్హులకు అందజేస్తున్నామని, ఇంకా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల, అభివృద్ధి సంస్థ చైర్మెన్ మువ్వా విజరు బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, డీఈ మహేష్ బాబు, ఖమ్మం రూరల్ మండలం తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో రహదారులను పూర్తి స్థాయిల్లో నిర్మిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES