Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీరు నిలవకుండా మురికి కాలువల నిర్మాణం చేపడతాం...

నీరు నిలవకుండా మురికి కాలువల నిర్మాణం చేపడతాం…

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద : వర్షాకాలంలో ప్రధాన రహదారి పైన వీధులలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అతి త్వరలో ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేసి మురికి కాలువలు నిర్మాణం చేపట్టి ప్రధాన రహదారిపై వార్డులలో నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని బిచ్కుంద పట్టణ మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్యం అన్నారు. గురువారం బస్టాండ్ ముందలగల ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతల వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతు ప్రమాదాల గురవుతున్నారని ప్రమాదకరంగా మారిన గుంతలను పరిశీలించి పూడ్చివేసారు. ప్రధాన మురికి కాలువల ద్వారా వెళ్లాల్సిన వర్షపు నీరు ఇళ్లల్లోకి వెళ్లి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రధాన మురికి కాలువ డైవర్ట్ చేసి బస్టాండ్ ప్రాంతం నుండి నేరుగా వెళ్లే విధంగా మురికి కాలువలు నిర్మాణం చేపడతామని బస్టాండ్ ప్రాంతంలో సాధ్యసాధ్యులను పరిశీలించారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్ఐ మోహన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -