– సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పురుషోత్తం
నవతెలంగాణ – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండా పోటీ చేస్తామని సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు. రంగారెడ్డి జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కురుమలగూడ పార్టీ ఆఫీస్‌లో ఆర్ ఝాన్సీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బి పురుషోత్తం హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ బంధు, రైతు బంధు, ఎస్సీ ఎస్టీ బంధు అని పేర్లు చెప్పి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి, నోటిఫికేషన్‌లకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో వ్యవసాయ భూములను ప్రజల నుంచి లాక్కున్నారన్నారు. ప్రజలను విస్మరించి కుటుంబ పాలన కొనసాగించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నదన్నారు. రాజకీయలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాల్లో స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు రూ. ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ సర్కార్ అందిస్తోందన్నారు. అయితే చాలా మందికి ఈ పథకం వర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం చొరవచూపి మరోసారి సర్వే చేయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లోనూ అసలైన లబ్దిదారులను గుర్తించి వారికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఏ ప్రభుత్వం తమకు మేలు చేస్తున్నదో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. బడంగ్‌పేట్ పంచాయతీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ రోహిణి రమేశ్ సేవలను కొనియాడారు. ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను వార్డులోని సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తుండటం హర్షణీయమన్నారు. అభివద్ధిపై దష్టి పెట్టడంతో పాటు, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ముందుంటున్న రోహిణి రమేశ్ లాంటి నాయకులు రాజకీయాలలో ఇంకా ఎదగాలని ఆకాక్షించారు. పదో వార్డులో గత పరిస్థితికి ఇప్పుడున్న అభివృద్ధికి తేడాను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారన్నారు. ఇలాంటి నాయకున్ని వచ్చే ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సర్వే నంబర్ 46 లోని కూర్మాల ఇండ్లను బాలాపూర్ మండల అధికారులు జేసీబీలతో కూల్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారికి అదే స్థానంలో మళ్లీ ఇండ్లు నిర్మించాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు భావజాలంతో ప్రజల పక్షపాతిగా పేదలకు అండగా ఉంటున్న రోహిణి రమేశ్‌ను మరో సారి ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్ ఝాన్సీ, నాగేంద్రమ్మ, సుజాత, జి. కష్ణ, సిహెచ్. రాజు, భాను ప్రసాద్, నాగమణి, అరుణ జగదాంబ, జ్యోతి, సురేశ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండా పోటీ చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES