సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బస్వాపురం గ్రామ సమస్యలతో పాటు భువనగిరి డివిజన్ వ్యాప్తంగా రైతాంగానికి సాగు నీరు అందించాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ అన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన అనే ఉద్యమాలకు నాయకత్వం వహించి ముందుండి పనిచేసి ప్రజా నాయకుడు అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ మృతిసీపీఐ(ఎం)కు, పజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. వారి స్ఫూర్తితో ఎర్రజెండా రాజ్యం కోసం ప్రజా ఉద్యమాలను ఉధృతంగా కొనసాగిస్తామని తెలిపారు.
గురువారం భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో అమరజీవి కామ్రేడ్ రసాల వెంకటేశ్ గారి తొమ్మిదవ రోజు కార్యక్రమం సందర్భంగా సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంతాప సభ గ్రామ శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏషాల అశోక్ , సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, ఐలు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు డా.బొల్లెపల్లి కుమార్, మామిడి వెంకట్ రెడ్డి, డిబిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దూదిమెట్లు రాజేశ్వరి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య లు హాజరై, మాట్లాడారు.
ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, మధ్యపురం బాల్ నరసింహ, గ్రామ నాయకులు ఉడుత విష్ణు, నరాల చంద్రయ్య, ఉడుత వెంకటేష్, నరాల కృష్ణ, నరాల వెంకటేష్, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ తోపాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.
కా. రాసాల వెంకటేశ్ స్పూర్తితో ప్రజా పోరాటాలను కొనసాగిస్తాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES